Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?
- August 5, 2026 / 06:13 PM ISTByPhani Kumar
ఎస్.ఎస్. రాజమౌళి,నితిన్ కలయికలో వచ్చిన ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ ‘సై’తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ రావత్(Pradeep Rawat). ఆ సినిమాలో క్రూరమైన విలన్ భిక్షు యాదవ్ పాత్రతో టాలీవుడ్ మొత్తాన్ని భయపెట్టాడు అని చెప్పాలి. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్లో బిజీ విలన్ అయిపోయాడు. నిన్న ఆయనకు బ్లడ్ క్లాట్ అయిన కారణంగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఆయనను ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ లాభం లేకుండా పోయింది.చికిత్స పొందుతూనే ఆయన మరణించారు.
Pradeep Rawat

ప్రదీప్ రావత్ ఆకస్మిక మరణం యావత్ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలీవుడ్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ రావత్..కి ‘లగాన్’ సినిమా మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు భోజ్‌పురి సినిమాల్లో కూడా నటించారు. ఇక సౌత్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన గంభీరమైన ఆహార్యంతో తెలుగు, తమిళ భాషల సినిమాల్లో కూడా అవకాశాలు పొందారు.’సై’ తో పాటు ‘ఛత్రపతి’ ‘గజని’ వంటి సినిమాలు ఈయన స్థాయి పెంచాయి.
మొత్తంగా ప్రదీప్ రావత్ కెరీర్ లో సుమారు 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఈ లెక్కన చూసుకుంటే.. ప్రదీప్ రావత్ ఎంత వరకు సంపాదించారు అనే ఓ ప్రశ్న అందరిలో మిగిలే ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం..ఆయన విలన్ గా సినిమాల్లో నటిస్తున్నప్పుడు రోజుకు రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు పారితోషికం ఇచ్చేవారట. ఆయన చేసిన అప్పులు వంటివి పోగా, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా చాలా వరకు వెనకేశారట.
మరోవైపు స్థలాలు కూడా కొనుగోలు చేసినట్టు వినికిడి. ఇలా అన్నిటితో కలుపుకుని.. మొత్తంగా రూ.41 కోట్ల విలువైన ఆస్తులు ప్రదీప్ రావత్ కి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రదీప్ రావత్ భార్య పేరు కళ్యాణి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రదీప్ రావత్ భౌతిక కాయాన్ని ముంబై, గోరేగావ్‌లోని ఆయన స్వగృహంలో నిన్నటి నుండి ఉంచారట.అక్కడే దగ్గరలోని ప్రదేశంలో ఈరోజు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’















