మన హీరోలు మద్యం ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడం కొత్తేమీ కాదు.. చాలా మంది హీరోలు ఆ పని చేశారు. ఈ మధ్య బాలకృష్ణ అయితే ఓటీటీ షో ద్వారా కూడా తన ఫేవరెట్ బ్రాండ్ కు ప్రచారం కల్పించారు. బాలీవుడ్ లో అయితే హీరోయిన్లు కూడా లిక్కర్ బ్రాండ్స్ కి ప్రచారకర్తలుగా పని చేస్తున్నారు. ఇప్పుడు ఆ పద్ధతి టాలీవుడ్ లోకి కూడా వచ్చేసింది. హీరోయిన్ గా ఆమె సీన్ అయిపోయిందనుకుంటున్న సమయంలో ‘అఖండ’ సినిమాలో లీడ్ రోల్ గా ప్రగ్యాజైశ్వాల్ కి ఛాన్స్ ఇచ్చారు బోయపాటి శ్రీను.
ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పడు ఈ బ్యూటీ తన కెరీర్ లో ఆశలు పెట్టుకుంది. యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్, షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఇలా ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు. ఇప్పుడో మద్యం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ.. ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. పక్కన ఫుల్ బాటిల్ పెట్టుకొని, బ్లాక్ డ్రెస్ లో హొయలొలికించింది.
ఆ లిక్కర్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ.. నీతులు కూడా చెప్పింది ఈ బ్యూటీ. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నాయి. మద్యం తాగమంటూ ఎంకరేజ్ చేస్తూనే.. బాధ్యతాయుతంగా తాగాలని, పాతికేళ్లు దాటిన కుర్రాళ్లకు మాత్రమే ఈ కంటెంట్ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమెపై ట్రోలింగ్ నడిచింది. డబ్బు సంపాదించడం కోసం ఆల్కహాల్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తావా..? అంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే హీరోయిన్లు ఇలా లిక్కర్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం కొత్తేమీ కాదు. రీసెంట్ గా పూజాహెగ్డే కూడా అలానే చేసింది. పాయల్ రాజ్ పుత్, ఇలియానా, కాజల్.. ఇలా చాలా మంది లిక్కర్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేశారు.