మరో మెగా హీరోతో ప్రగ్యా జైస్వాల్

Advertisement

దర్శకుడు క్రిష్ రూపొందించిన ‘కంచె’ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో నటించిన ప్రగ్యా జైస్వాల్ మరో  మెగా హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సందీప్ కిషన్, రెజీనా హీరో, హీరోయిన్లుగా క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న‘నక్షత్రం’ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతని పక్కన జోడిగా ప్రగ్యా జైస్వాల్ ను సెలక్ట్ చేశారు. ఆమెది కూడా పోలీస్ అధికారి పాత్రే అంటూ దర్శకుడు బుధవారం వెల్లడించారు.

ప్రగ్యా హీరో సందీప్ కిషన్ తో ఫైట్ సెక్వెన్స్ ఉంటుందని తెలిపి ఆసక్తిని కలిగించారు. ఇప్పటికే స్టార్స్ తో నిండిన నక్షత్రంలోకి మరో గ్లామర్ తోడు అయిందని డైరక్టర్, హీరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాజల్ అగర్వాల్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్న ఈ చిత్రంలో యువ హీరో తనీష్ విలన్ గా నటిస్తున్నాడు. వీరందరిని లెక్క వేసుకుంటే ఇందులో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు వివిధ పాత్రల్లో ఇమిడి పోనున్నట్లు తెలుస్తోంది. మినీ మల్టీ స్టారర్ మూవీగా చెప్పుకోవచ్చు. కొంతకాలంగా విజయాన్ని అందుకోలేక పోతున్న కృష్ణ వంశీ ఈ సినిమాతో హిట్ కొట్టాలని క్రేజీ కాంబినేషన్ ను మిక్స్ చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus