కెజిఎఫ్ 2లో ప్రకాష్ రాజ్ పాత్రపై క్రేజీ బజ్..!

  • August 27, 2020 / 09:38 AM IST

సంచల చిత్రం కెజిఎఫ్ కి కొనసాగింపుగా కెజిఎఫ్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరకు దశకు చేరగా లాక్ డౌన్ తరువాత వాయిదా పడింది. దాదాపు ఐదు నెలల తరువాత కెజిఎఫ్ 2 షూటింగ్ మొదలైంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని కీలక పాత్రలపై షూటింగ్ మొదలుపెట్టారు. కెజిఎఫ్ 2 మూవీ వర్కింగ్ స్టిల్స్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది.

ఆ ఫొటోలలో ప్రకాష్ రాజ్ ఓ విభన్నమైన గెటప్ లో దర్శనం ఇచ్చారు. దీనితో విలక్షణ నటుడిగా పేరున్న ప్రకాష్ రాజ్ కెజిఎఫ్ 2లో నటిస్తున్నాడన్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఐతే ప్రకాష్ రాజ్ లుక్ చూసిన తరువాత కెజిఎఫ్ 2లో ఆయన పాత్రపై ఊహాగానాలు మొదలయ్యాయి. కెజిఎఫ్ మూవీలో సీనియర్ జర్నలిస్టుగా నటించిన అనంత్ నాగ్ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారని అంటున్నారు. ప్రకాష్ రాజ్ లుక్ తో పాటు, ఆ ఫోటో నేపథ్యం కూడా ఆయన జర్నలిస్ట్ అనే విషయాన్ని బలపరిచేదిగా ఉంది.

అలాగే గతంలో కెజిఎఫ్ 2 నుండి అనంత్ నాగ్ తప్పుకున్నారని వార్తలు రావడం జరిగింది. దీనితో అనంత్ నాగ్ స్థానంలో కీలకమైన ఆ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారని అంటున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్దిరోజుల్లో ఆగాల్సిందే.

1

2

3

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus