విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రకాష్ రాజ్ మొదటి భార్య పేరు లలిత కుమారి అనే సంగతి తెలిసిందే. లలిత కుమారి ప్రకాష్ రాజ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
2009 సంవత్సరంలో ప్రకాష్ రాజ్ లలితకుమారికి విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ పోనీవర్మను వివాహం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తన పెద్ద కూతురు పూజ చదువు పూర్తైందని చెప్పుకొచ్చారు. సంగీతంలో తన కూతురికి ఎంతో ఆసక్తి ఉందని అందులో తన కూతురు ఎదగాలని అనుకుంటున్నారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. పెళ్లి విషయంలో కూతురికి తాను తండ్రిలా ఉండలేనని ప్రకాష్ రాజ్ తెలిపారు.
కూతురుకు అవసరమైతే సినీ కెరీర్ విషయంలో హెల్ప్ చేస్తానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. పెళ్లికి అవసరమైతే డబ్బులు ఇస్తానని వాళ్లు పిలిస్తే పెళ్లికి వెళ్లి అక్షింతలు కూడా వేస్తానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ప్రకాష్ రాజ్ కామెంట్లు విన్న నెటిజన్లు కుటుంబ సభ్యుల విషయంలో ప్రకాష్ రాజ్ అంత కఠినంగా వ్యవహరించడం సరి కాదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రకాష్ రాజ్ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు ఉన్నాయి.