Prakash Raj, Sai Pallavi: సాయిపల్లవికి ప్రకాష్ రాజ్ సపోర్ట్.. కానీ?

  • June 20, 2022 / 01:18 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి గోహత్యల గురించి, కశ్మీర్ పండిట్స్ గురించి చేసిన కామెంట్ల గురించి నెట్టింట జోరుగా చర్చ జరగగా ఎక్కువమంది సాయిపల్లవికి వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు. సాయిపల్లవి చేసిన వ్యాఖ్యల వల్ల విరాటపర్వం సినిమాను చూడబోమని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేశారు. సాయిపల్లవి గురించి కొంతమంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే తను చేసిన వ్యాఖ్యల గురించి చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని భావించిన సాయిపల్లవి తన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అందరి ప్రాణాలు ముఖ్యమేనని సమాజంలో ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉందని ఆమె చెప్పుకొచ్చారు. మతం పేరుతో హింసించడం మహాపాపమని ఆమె వ్యాఖ్యలు చేశారు. తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కొందరు వార్తలు సృష్టించారని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. సాయిపల్లవిని సపోర్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. మానవత్వమే అన్నింటికంటే ముందు అని సాయిపల్లవి మేము మీతో ఉన్నాం అంటూ ప్రకాష్ రాజ్ వెల్లడించారు.

మరి కొందరు సెలబ్రిటీలు సైతం సాయిపల్లవికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని సాయిపల్లవి ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాయిపల్లవి విరాటపర్వం సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. సాయిపల్లవి విరాటపర్వం సినిమాలోని వెన్నెల పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. సాయిపల్లవికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. సాయిపల్లవి ఈ మధ్య కాలంలో పెళ్లి గురించి ఎక్కువగా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో త్వరలో సాయిపల్లవి పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వరుస విజయాలతో సాయిపల్లవి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. ఫస్ట్ వీకెండ్ వరకు విరాటపర్వం సినిమాకు పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లు వస్తుండగా వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది,

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus