టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా కొన్నాళ్ళు రాణించింది ప్రణీత. ఏం పిల్లో ఏం పిల్లడో, అత్తారింటికి దారేది.. వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ప్రణీత.. తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళకపోయినా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. లాక్ డౌన్ టైంలో ఈమె ఎంతో మందికి ఆకలి తీర్చింది. రియల్ హీరోయిన్ అనిపించుకుంది. ఇలా గతేడాది అంటే 2021 ఏప్రిల్ లో ఈమె బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజు ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
గ్రాండ్ గా కాకుండా సింపుల్ గా ఇంకా చెప్పాలి అంటే సీక్రెట్ గా వీరి పెళ్ళి జరిగింది. ప్రణీత కుటుంబ సభ్యులకి ముహూర్తాల పట్టింపులు ఎక్కువ కావడంతో మూడాలు వంటి సెంటిమెంట్ల వల్ల ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ గా వీరి వివాహం చేసేసినట్లు ప్రణీత తెలిపింది. ఇదిలా ఉండగా.. ఈరోజు ప్రణీత భర్త నితిన్ రాజు పుట్టినరోజు. అతనికి ఇది 34వ పుట్టినరోజట. ఇదే రోజున మరో విశేషం కూడా ఉందని చెప్పింది ప్రణీత.
ఆమె ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అయ్యిందట. ‘నా భర్త 34వ పుట్టినరోజు నాడు దేవతలు మాకు ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి మమ్మల్ని సర్ప్రైజ్ చేసారు అంటూ ప్రణీత.. తన ఇన్స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది. అంతేకాదు ఓ ఫోటోని కూడా జత చేసింది.ఈ ఫోటోలో ప్రణీత భర్త… ఈమెను ఎత్తుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అలాగే సోషల్ మీడియాలో అభిమానులు ప్రణీతకి కంగ్రాట్యులేషన్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు.