Pranitha Subhash: ప్రణీత డ్యాన్స్ వీడియో వైరల్..ఒక్కసారిగా కన్ఫ్యూజ్ చేసిందిగా..!

Advertisement

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా నటించిన మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రణీత.. గతేడాది అంటే మే 30న నితిన్ రాజు అనే బిజినెస్మెన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల అతని పుట్టినరోజు నాడు ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా తెలియజేసింది. అంతేకాకుండా అప్పుడప్పుడు బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ మురిసిపోతున్నట్టు రాసుకొస్తుంది ప్రణీత. ఏప్రిల్ 11న ప్రణీత గర్భవతి అయిన విషయాన్ని వెల్లడించింది.

Click Here To Watch NOW

ముందుగా తన భర్త నితిన్‌ కు చెప్పి ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకి తెలియజేసింది ఈ అమ్మడు. ఇక ప్రెగ్నెన్సీ టైంలో యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేసేందుకు కూడా సమయాన్ని కేటాయిస్తానని చెప్పుకొచ్చింది.ఫ్రీ డెలివరీ కోసం ఇలా చిన్న చిన్న వర్కౌట్లు చేయిస్తుంటారు వైద్యులు. కాజల్ కూడా ఇలాంటి చిన్న చిన్న వర్కౌట్లు చేసేది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె డ్యాన్స్ చేసిన ఓ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ‘అసలే ఆమె ప్రెగ్నెంట్ కదా ఇలాంటి వీడియో చేసింది ఏంటి?’ అని..! అయితే ఇది ‘త్రో బ్యాక్’ వీడియో అని తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోలో ఆమె రెట్టింపు జోష్ తో స్టెప్పులు వేస్తుంది. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మరో పక్క ప్రణీత ప్రెగ్నెన్సీ అనుభవాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూనే ఉంది.

1

2

3

4

5

6

7

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news