Pranitha: పట్టుచీరలో కుందనపు బొమ్మలా ప్రణీత!

బొంగరాళ్లాంటి కళ్లు తిప్పింది.. ఉంగరాలున్న జుట్టు తిప్పింది.. గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ.. అమ్మో.. బాపుగారి బొమ్మో.. ఈ పాటే గుర్తు చేసుకునే విధంగా రెడీ అయింది కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్.. లేటెస్ట్ గా పోస్టు చేసిన ఫొటోలు చూస్తే మీరు కూడా ఈ పాటే పాడుకుంటారు. ఎందుకంటారా.. ఆ భామ అచ్చం బాపూబొమ్మలాగే ఉంది కాబట్టి. లేటెస్ట్ గా ప్రణీత పట్టుచీరలో సందడి చేసింది. చీరకట్టులో ప్రణీత కుందనపు బొమ్మలా కనిపిస్తోంది.

ఎల్లో అండ్ వయోలెట్ కలర్ పట్టుచీరలో తల్లో మల్లెపూలు పెట్టుకుని.. జుట్టును ముడివేసుకుని నుదుట బొట్టు పెట్టుకుని అచ్చతెలుగు పదహారణాల తెలుగమ్మాయిలా కనిపిస్తోంది. ఈ ఫొటోలను ప్రణీత తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రణీత అచ్చతెలుగు అమ్మాయిలా ఉందంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. పెళ్లయి కూతురు పుట్టినా ఈ భామ అందం మాత్రం తగ్గలేదని అంటున్నారు. రోజురోజుకు ప్రణీత అందం మరింత పెరుగుతోందని కామెంట్ చేస్తున్నారు.

ప్రణీత లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు. ప్రణీత మెస్మరైజింగ్ స్మైల్ చూసి మైమరిచిపోతున్నారు. చీరకట్టులో ఈ బ్యూటీ చాలా చాలా అందంగా కనిపిస్తోంది. సాధారణంగా ఎప్పుడు పద్ధతిగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో ఇంకా అందంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రణీత లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు.

ప్రణీత (Pranitha) ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సిద్ధార్థ్ తో కలిసి బావ మూవీలో నటించింది. అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్ వంటి సినిమాల్లో అలరించింది. అయితే ఈ బ్యూటీకి ఇప్పటి వరకు సాలిడ్ హిట్ రాలేదు. ప్రస్తుతం ఈ భామ తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus