హీరోయిన్ ప్రణీత.. తన భర్త నితిన్ రాజు 34 వ పుట్టినరోజు నాడు మరో విశేషాన్ని తెలియజేసిన సంగతి తెలిసిందే. నితిన్ రాజు 34 వ పుట్టినరోజు నాడే ఆమెకి ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయినట్టు తెలిపింది. ‘నా భర్త 34వ పుట్టినరోజు నాడు దేవతలు మాకు ఓ అద్భుతమైన గిఫ్ట్ ను అందించి ఆశీర్వదించారు. ఇది మాకు నిజంగానే పెద్ద సర్ప్రైజ్ అనిపించింది’ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చి తన భర్తతో ఆ ఆనందాన్ని పంచుకుంటూ దిగిన రొమాంటిక్ ఫోటోని షేర్ చేసింది.
ఆ తర్వాత తన బేబీ బంప్ తో అడ్డం ముందు చూసుకుంటూ నవ్వుకుంటున్న ఫోటోని కూడా షేర్ చేసింది. ‘మహిళలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని తెలిసినప్పటి నుండీ ప్రతీక్షణం తమ పొట్టను తనిఖీ చేసుకుంటూ ఉంటారు’ అంటూ ఆ ఫోటోకి కామెంట్ పెట్టింది. తాజాగా స్విమ్మింగ్ పూల్ వద్ద తన బేబీ బంప్ ను చూసుకుంటూ దిగిన ఫోటోని కూడా షేర్ చేసింది. ఇలా ప్రతీ క్షణం తన మాతృత్వాన్ని తలుచుకుని ఆమె సంతోషపడుతున్నట్టు స్పష్టమవుతుంది.
”ఏం పిల్లో ఏం పిల్లడో’,’బావ’ ‘అత్తారింటికి దారేది’ .. వంటి చిత్రాల్లో నటించి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రణీత అటు తర్వాత కోలీవుడ్, బాలీవుడ్లో కూడా సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళకపోయినా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. లాక్ డౌన్ టైంలో ఈమె చేసిన సేవా కార్యక్రమాలు ఎవ్వరూ కూడా అంత ఈజీగా మర్చిపోలేరు. ఎంతో మందికి ఆకలి తీర్చి ఈమె రియల్ హీరోయిన్ అనిపించుకుంది.
ఇక 2021 ఏప్రిల్ లో ఈమె బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజు ని పెళ్లి చేసుకుని సినిమాలకి దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. గతేడాది ఈమె రెండు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటించింది కానీ అవి రెండు ఓటిటిలో రిలీజ్ అవ్వడం వలన ఈమెకు పెద్దగా కలిసిరాలేదు.
1
2
3
4
5
6
7
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!