Salaar: ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్.. సలార్ రికార్డులు చేయనుందా?

  • March 15, 2023 / 03:38 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సలార్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైందని తెలుస్తోంది. అటు ప్రభాస్ కు ఇటు ప్రశాంత్ నీల్ కు భారీ స్థాయిలో క్రేజ్ ఉండటంతో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సలార్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉన్నాయని బోగట్టా. శృతి హాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ రోల్ లో నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది జులై నుంచి ప్రశాంత్ నీల్ ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు. బాలీవుడ్ లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది. సినిమాపై అంచనాలను రెట్టింపు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వరుసగా అప్ డేట్స్ ఇస్తూ సలార్ సినిమాపై క్రేజ్ ను పెంచనున్నారని బోగట్టా. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో నిర్మాతలకు బడ్జెట్ తో పోల్చి చూస్తే రెట్టింపు లాభాలు ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమా నిడివి ఎక్కువగానే ఉంటుందని ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని సమాచారం అందుతోంది.

సలార్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. అతి త్వరలో సలార్ మూవీ టీజర్ రిలీజ్ కానుందని బోగట్టా. ఈ సినిమా కథకు సంబంధించి ఎలాంటి విషయాలు లీక్ కాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus