మొన్నీమధ్య ‘డ్రాగన్’ (అప్పటికి టైటిల్ అనౌన్స్ చేయలేదు అనుకోండి) సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసినప్పుడు ఓ చర్చ జరిగింది. సినిమాను సుమారు ఏడాది ఎందుకు వాయిదా వేశారు అని. అలాగే ఎన్టీఆర్ పుట్టిన రోజుకు స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారని, అది నాలుగు నిమిసాల నిడివి ఉంటుందని చెప్పడంతో.. ఏడాది తర్వాత రాబోయే సినిమాకు ఇప్పుడే అంత పెద్ద వీడియో ఎందుకు అనే చర్చ కూడా సాగింది.
రెండో ప్రశ్నకు సమాధానం ‘డ్రాగన్’ వరల్డ్, టీమ్‌ను ప్రజలకు అలవాటు చేయడానికే అని తెలిసిందే. అయితే ఈ విషయాన్ని సినిమా టీమ్ చెప్పలేదు అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్నకు సమాధానం ఇదీ అంటూ ఓ డిస్కషన్ బయటకు వచ్చింది. అదే ‘ధురంధర్’ ట్రిక్. సినిమాను రెండు పార్టలుగా చేసి.. ఒకటి విడుదలయ్యాక, ఇంకొకటి స్టార్ట్ చేసి.. ఎప్పటికో రెండు పార్టు తీసుకురావడం అనేది మన రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్ కాన్సెప్ట్. ఆ మాటకొస్తే ప్రశాంత్ నీల్ కాన్సెప్ట్ కూడా ఇదే. అందుకే ‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’, ‘కల్కి 2’ ఇంకా రాలేదు.
కానీ ‘ధురంధర్’ సినిమా అలా కాదు. తొలి పార్టు వచ్చిన కొద్ది రోజులకే రెండో పార్టును రిలీజ్ చేసేశారు దర్శకుడు ఆదిత్య ధర్. ఇప్పుడు ‘డ్రాగన్’ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ అదే చేయబోతున్నారని టాక్. రెండు పార్టుల షూటింగ్‌ని దాదాపు పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కాస్త సమయం తీసుకొని రెండు పార్టులూ వెంటవెంటనే రిలీజ్ చేసేయాలని అనుకుంటున్నారని టాక్. దీనికి తగ్గట్టే సినిమాలో రెండు జోన్లు ఉంటాయని గ్లింప్స్‌లో చెప్పారు అని అంటున్నారు.
గ్లింప్స్‌లో ప్రస్తుతం చెప్పిన సమాచారంలో అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ గురించి మాత్రమే ఉంది. మరో కంపెనీ గోల్డెన్ ట్రయాంగిల్‌లో ఎవరు ఉంటారు అనేది చెప్పలేదు. అదంతా రెండో పార్టులో చూపిస్తారు అని టాక్. ఆ లెక్కన ‘డ్రాగన్’ రెండు పార్టులుగా రావడం పక్కా అని చెప్పొచ్చు.