తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ ట్రైలర్ తాజాగా విడుదల కాగా ఈ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. హిందీలో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. హనుమాన్ ఎక్కువ రోజులు నిలబడే సినిమా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా ఇది అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాను అభిమానులు ఒకసారి చూస్తారని హనుమంతుడి కోసం మరోసారి చూస్తారని
అలా ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుందని హనుమాన్ మేకర్స్ వెల్లడించారు. ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామనే పట్టింపు మాకు లేదని థియేటర్లలో ఎన్ని రోజులు మా సినిమా ప్రయాణిస్తుందనేది కావాలని మేకర్స్ పేర్కొన్నారు. హనుమాన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. హనుమాన్ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ నటించి ఉంటే మరోలా ఉండేదని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లపై ప్రశాంత్ వర్మ స్పందించారు.
ప్రభాస్ కు హనుమంతుడి పవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్వతహాగా ప్రభాస్ బలవంతుడని చెప్పుకొచ్చారు. హనుమాన్ సినిమాలో తేజ సామాన్యుడిలా కనిపిస్తాడని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు. హనుమాన్ విడుదలైన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి. హనుమాన్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది.
తేజ సజ్జా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో తెరకెక్కింది. సంక్రాంతి సినిమాలన్నీ సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!