Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్
- April 9, 2026 / 12:50 PM ISTByFilmy Focus Desk
టాలీవుడ్‌లో గత కొన్ని నెలలుగా ఓ సినిమా కథ చక్కర్లు కొడుతూనే ఉంది. ఒక స్టార్ హీరో నుండి మరో స్టార్ హీరోకు తిరుగుతూనే ఉంది. ఓ స్టార్ దర్శకుడు రాసిన ఆ కథ ఇప్పుడు అటూ ఇటూ కాకుండా మధ్యలో ఉండిపోయింది. అదే కుమారస్వామి కథ. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సిద్ధం చేసుకున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా కథ తొలుత అల్లు అర్జున్ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత వివిధ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత ఇప్పుడు బన్నీ దగ్గరకు వచ్చింది. మరిప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.
Prashanth Varma
ప్రస్తుతానికి అయితే ‘గాడ్ ఆఫ్ వార్’ పనులు పక్కన పెట్టి వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ సినిమా పనుల్లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. ఆ తర్వాతే కుమార స్వామి సంగతి చూద్దాం అనుకున్నారని టాక్. అయితే మరో దర్శకుడు ఇప్పుడు కుమార స్వామి కథను తెరకెక్కించే పనిలో ఉన్నారట. అయితే ఇది థియేటర్ కోసం కాదని, వెబ్ సిరీస్ కోసమని సమాచారం. కుమార స్వామి కథను తెరకెక్కించాలని ఓ ఓటీటీ చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోందట. ఈ పనిని ఇప్పుడు ప్రశాంత్ వర్మ దగ్గరకు తెచ్చారట. ఆయన కుమార స్వామి కథతో ఓ స్క్రిప్టు రాసుకున్నారట.

అయితే, ఆ సినిమాకు ప్రశాంత్ వర్మ కేవలం షో రన్నర్‌గానే వ్యవహరిస్తారట. దర్శకత్వ బాధ్యతలు వేరే దర్శకుడికి అప్పగించే ఆలోచనలో ఉన్నారట. అన్నట్లు త్రివిక్రమ్ కాకుండా మరో దర్శకుడు కూడా కుమార స్వామి కథను సిద్ధం చేసుకున్నారు. ఆయనే రీసెంట్‌గా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా తెరకెక్కించిన తిరుమల కిషోర్. త్వరలోనే ఈ సినిమా రూపొందిస్తా అని మొన్నీమధ్య అన్నారు కూడా. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ స్పీడప్ చేస్తున్నారట. ఈ లెక్కన ఎవరి ‘కుమార స్వామి’ తొలుత రిలీజ్ అవుతుందో చూడాలి.











