Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?
- August 15, 2026 / 06:15 PM ISTByPhani Kumar
మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన హర్రర్ కామిడీ మూవీ ‘కొరియన్ కనకరాజు'(Korean Kanakaraju). ‘యూవీ క్రియేషన్స్’ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్’ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కమేడియన్ సత్య అత్యంత కీలక పాత్ర పోషించాడు. తమన్ సంగీత దర్శకుడు. హారర్ జోనర్ అంటే ఇష్టపడే ఆడియన్స్ ఎక్కువమందే ఉన్నారు. దీంతో మొదటి నుండి ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.
Korean Kanakaraju Collections

ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని మెప్పించాయి. మొదటి రోజు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. మొదటి సోమవారంతో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్ళే సాధించింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 5.54 cr |
| సీడెడ్ | 1.62 cr |
| ఆంధ్ర(టోటల్) | 5.73 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 12.89 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.98 cr |
| ఓవర్సీస్ | 1.98 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 15.85 cr(షేర్) |
‘కొరియన్ కనకరాజు’ చిత్రానికి రూ.11.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.15.85 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.29.6 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.3.85 కోట్ల లాభాలు ఇప్పటివరకు బయ్యర్స్ కి అందించింది. రెండో వారం కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి.. ‘కనకరాజు..’ ఎన్ని థియేటర్లలో నిలదొక్కుకుంటాడో చూడాలి.
‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్















