‘జిఏ2 పిక్చర్స్’ అండ్ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘ప్రతీరోజు పండగే’. ఈ ఏడాది ‘చిత్రలహరి’ చిత్రంతో డీసెంట్ హిట్ కొట్టి ప్లాపుల నుండీ బయటపడిన సాయితేజ్.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ఈ చిత్రం చేశాడు. ఇక రాశీ ఖన్నా ఈ చిత్రంలో ‘టిక్ టాక్’ కామెడీ తో బాగా ఎంటర్టైన్ చేసింది. ఈ చిత్రం కథ మొత్తం సత్య రాజ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం మొత్తం క్రెడిట్ రావు రమేష్ కే దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన కామెడీ టైమింగ్ తో.. ప్రేక్షకుల కడుపు చెక్కలు చేసేస్తాడనే చెప్పాలి. ఇక డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం మొదటి వారం పూర్తికాకుండానే బ్రేక్ ఈవెన్ సాధించింది.
‘ప్రతీరోజూ పండగే’ 6 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 6.56 cr |
సీడెడ్ | 1.90 cr |
ఉత్తరాంధ్ర | 2.21 cr |
ఈస్ట్ | 1.09 cr |
వెస్ట్ | 0.85cr |
కృష్ణా | 1.14 cr |
గుంటూరు | 1.04 cr |
నెల్లూరు | 0.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.03 cr |
ఓవర్సీస్ | 2.11 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 18.43 cr (share) |
‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 18.43 కోట్ల షేర్ ను రాబట్టింది. నిన్న క్రిస్ట్మస్ రోజు సెలవుని ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకుందనే చెప్పాలి. నిన్న ఈ చిత్రం ఏకంగా 3.10 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి బ్లాక్ బస్టర్ గా నిలిచే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
Click Here to Read Prati Roju Pandage Movie Review