మెగా మేనల్లుడు సాయి తేజ్.. కు 2019 బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే… అరడజను ప్లాఫుల తర్వాత ‘చిత్రలహరి’ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ చిత్రంతో డీసెంట్ హిట్ మాత్రమే కొట్టిన తేజు.. తరువాత ‘ప్రతీరోజూ పండగే’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టరే కొట్టాడు. ‘జిఏ2 పిక్చర్స్’ అండ్ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేసాడు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సత్య రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రలు పోషించారు.
డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్లను రాబడుతుండడం విశేషం. ఇక ఈ చిత్రం 20 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
12.13 cr
సీడెడ్
3.86 cr
ఉత్తరాంధ్ర
4.69 cr
ఈస్ట్
2.02 cr
వెస్ట్
1.50 cr
కృష్ణా
2.05 cr
గుంటూరు
1.96 cr
నెల్లూరు
0.89 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.81 cr
ఓవర్సీస్
2.58 cr
వరల్డ్ వైడ్ టోటల్
33.49 cr (share)
‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 20 రోజులు పూర్తయ్యేసరికి 33.49 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక 20 వ రోజున కూడా ఈ చిత్రం 0.30 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ టైర్2 హీరో సినిమాకి 20 వ రోజున 0.30 కోట్ల షేర్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.