ఈ నెల‌ఖ‌రున గోల చేస్తామంటున్న‌ ‘ప్రేమ‌లీల‌..పెళ్లి గోల’ టీమ్!

రెండు ద‌శాబ్ధాల‌కు పైగా రాయ‌ల‌సీమ‌లో నాలుగు వంద‌ల‌కు పైగా చిత్రాల‌ను పంపిణీ చేసిన శ్రీ మ‌హావీర్ ఫిలిమ్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల త‌మిళ్ విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన `వెల్లై కార‌న్` చిత్రాన్ని `ప్రేమ‌లీల‌-పెళ్ళి గోల` టైటిల్ తో మ‌హా వీర్ పిలిమ్స్ అధినేత‌ నిర్మాత పార‌స్ జైన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. విష్ణు విశాల్, నిక్కీ గ‌ల్రానీ నాయ‌కానాయిక‌లుగా న‌టించారు. ఎళిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. `జ‌ర్నీ` ఫేం స‌త్య సంగీతం అందించారు. ఇటీవ‌ల మార్కెట్ లో కి విడుద‌లైన పాట‌ల‌కు, ట్రైల‌ర్ల‌కు ప్రేక్ష‌కుల‌ను నుంచి విశేష ఆద‌ర‌ణ లభించింది. ఇక సినిమా రిలీజ్ కు కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఈనెల‌ఖ‌రున ( మే) సినిమా విడుద‌ల‌వుతుంది.

ఈ సంద‌ర్భంగా శ్రీ మ‌హావీర్ ఫిలింస్ అధినేత, నిర్మాత పార‌స్ జైన్ మాట్లాడుతూ ` ప్రేమ‌లీల ఒకరిది. పెళ్ళి గోల మ‌రొక‌రిది. అదే ఈ సినిమా క‌థ‌. కామెడీ..ల‌వ్ ..ఎమోష‌న్స్ అన్నీ అంశాల‌తో ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ గా తెర‌కెక్కింది. మాతృక‌లో సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగు లో ఆ స్థాయి విజ‌యాన్ని అందుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. తొలి కాపీ సిద్దమైంది. ఇటీవ‌లే చెన్నైలో స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షో వేశాం. సినిమా చూసిన వాళ్లంతా ఆద్యంతం క‌డుపుబ్బా న‌వ్వుకునే సినిమా అని ప్ర‌శంసించారు. ముఖ్యంగా ద్వితియార్థంలో సాగే కామెడీ హైలైట్ గా ఉంటుంది. ఈనెల‌ఖ‌రున‌ ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో భారీ ఎత్త‌న సినిమా రిలీజ్ చేస్తున్నాం` అని అన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus