సినిమా ఎంత బాగా తీసినప్పటికీ సరైన సమయంలో రిలీజ్ చేయకుంటే ఫలితం వేరేలా ఉంటుంది. అందుకు సీజన్ లో రిలీజ్ కి నిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. స్టార్ హీరోలు వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచే డేట్స్ ఖరారు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత బెస్ట్ సీజన్ వేసవి సెలవులు. అందుకే అప్పుడు థియేటర్ లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భరత్ అనే నేను మూవీ ఏప్రిల్ 27 న రిలీజ్ చేస్తామంటూ నిన్న ప్రకటించారు. అలాగే మే మొదటి వారంలో అల్లు అర్జున్ తన “నా పేరు సూర్య” మూవీని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక సంక్రాంతికి వస్తామని ప్రకటించిన మరో సినిమా రంగస్థలం ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా వేసవికి మూడు సినిమాలు బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. ప్రభాస్ అండ్ సుజీత్ టీమ్ సాహో ని ఎలా తెరకెక్కించాలని ద్రుష్టి పెట్టారు తప్ప రిలీజ్ గురించి ఆలోచించలేదు. స్టార్ హీరోలు డేట్స్ ప్రకటించడంతో ఆలోచనలో పడ్డారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఇప్పుడే రిలీజ్ డేట్ గురించి ఆలోచించే పనిలేదని సుజీత్ స్పష్టం చేసినట్లు తెలిసింది. సో హడావుడి పడకుండా హిట్ పైనే గురిపెట్టినట్లు తెలుస్తోంది.