Prithviraj Sukumaran: ప్రభాస్ పై ఫన్నీ పంచ్..లు వేసిన పృథ్వీరాజ్ సుకుమారన్

Advertisement

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అతని క్రేజ్ పెరిగింది. అతని మార్కెట్ పెరిగింది. అతని సినిమాల బడ్జెట్లు పెరిగాయి, పారితోషికం పెరిగింది. అయితే ఒక్క విషయంలో మాత్రం ప్రభాస్ అస్సలు మారలేదు అని ఇండస్ట్రీ మొత్తం చెబుతున్న మాట. కాదు కాదు మన ఇండస్ట్రీతో పాటు పక్క రాష్ట్రాల సినీ పరిశ్రమలు కూడా చెబుతున్న మాట అనాలి. ఇంతకీ అది ఏ విషయంలో అంటే.. ఆతిధ్యం విషయంలో..!

ప్రభాస్ ఆతిథ్యం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ కథలు కథలుగా చెబుతూ ఉంటారు. వారిది రాజకుటుంబం కాబట్టి.. ‘ఏదైనా పెట్టడంలో వారిది పెద్ద చేయి’ అని ఇండస్ట్రీలో కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు. అయితే ప్రభాస్ మాత్రం అది తన పెదనాన్న గారి వద్ద నుండి నేర్చుకున్న గుణం అని సింపుల్ గా చెబుతూ ఉంటాడు. సరే ప్రభాస్… తోటి నటీనటులకు ఇష్టమైన వంటకాలు వండించి, తెప్పించడంలో ముందుంటాడు.

ఈ విషయాన్ని చాలా మంది నటీనటులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ లిస్ట్..లోకి పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా వచ్చి చేరాడు. రాజమౌళితో ‘సలార్’ టీం పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ టాపిక్ గురించి డిస్కషన్ వచ్చింది. దీనికి పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ‘పొరపాటున మాకు ఏదైనా వంటకం ఇష్టం అంటే.. ప్రభాస్ వెంటనే అవి తెప్పించేస్తాడు. ఒకసారి మా పాప సెట్స్ కి వస్తే.. మాటల్లో ఆమెకు ఇష్టమైన వంటకాల గురించి తెలుసుకుని..

ఒక రూమంతా సరిపోయే వెరైటీ పంపించారు. కేవలం వాటి కోసం ఇంకో రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. మా ఫ్యామిలీ, బంధువులు అందరూ తిన్నా అవి మిగిలిపోతాయేమో..! ప్రభాస్ తో ఉండి డైట్ చేయడం చాలా కష్టం. ఆ విషయంలో అతను బాగా డేంజర్. కానీ ప్రభాస్ మాత్రం ఏరోజూ కూడా 4 రకాల వెరైటీలు తిన్నట్టు కూడా కనిపించడు. పప్పు, పచ్చడి ఉంటే సరిపోతుంది అతనికి ‘ అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) చెప్పుకొచ్చాడు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news