మహేష్ బాబు తో కలిసి ప్రియదర్శి కామెడీ

  • September 6, 2016 / 11:15 AM IST

తరుణ్‌ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ‘పెళ్లిచూపులు’ సినిమాలో కౌశిక్ గా కామెడీ పండించిన ప్రియదర్శికి అద్భుత అవకాశం వరించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి నవ్వించే ఛాన్స్ వచ్చింది. కమర్షియల్ డైరక్టర్ ఏఆర్ మురుగ దాస్ డైరక్షన్లో ప్రస్తుతం ప్రిన్స్ నటిస్తున్నారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రేపటి నుంచి రెండో షెడ్యూల్ చైన్నై లో మొదలు కానుంది.

ఈ షూటింగ్లో మహేష్, ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, తమిళ నటుడు ఆర్జే బాలాజీ తో పాటు ప్రియదర్శి పాల్గొననున్నాడు. ఈ విషయాన్నీ మంగళవారం ప్రియదర్శి తన ఫెస్ బుక్ పేజీలో వెల్లడించాడు. “నా కల నెరవేరింది. లెజెండరీ డైరక్టర్ మురుగదాస్, సూపర్ స్టార్ మహేష్ గారితో కలిసి పనిచేసే అదృష్టం లభించింది. ఇంకా కొన్ని సినిమాలకు ఒప్పుకున్నాను. వాటిని కూడా త్వరలోనే చెబుతాను” అని పోస్ట్ చేశారు. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ బాబు నటిస్తున్న ఈ ఫిల్మ్ ని తెలుగు, తమిళం రెండు భాషల్లో ఎం.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus