Priyadarshi: వైరల్ అవుతున్న ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్!

  • November 22, 2022 / 05:03 PM IST

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన ప్రియదర్శి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నటుడిగా రేంజ్ పెరుగుతున్నా ఒదిగి ఉండటం ద్వారా ప్రియదర్శి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ప్రియదర్శి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. సినిమా రంగంలో మనకు నచ్చనిది నచ్చలేదని చెప్పడం చాలా కష్టమని ప్రియదర్శి అన్నారు. నచ్చనిది నచ్చలేదని చెప్పడం కూడా ఒక కళేనని ప్రియదర్శి చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు నాకు తగిన రోల్స్ లో మాత్రమే నేను నటిస్తూ వచ్చానని ప్రియదర్శి అన్నారు. నాకు నచ్చని పక్షంలో సున్నితంగా నో చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. మనకు నచ్చనిదానిని నచ్చలేదని చెబితే తలపొగరు అని ప్రచారం చేస్తారని ప్రియదర్శి వెల్లడించారు. ఇతనో పెద్ద ఆర్టిస్ట్ లా ఫీల్ అవుతున్నాడని అంటారని ప్రియదర్శి చెప్పుకొచ్చారు. ఇతనికి నచ్చాలంట అంటూ ఏవేవో అనేసుకుంటారని ప్రియదర్శి వెల్లడించారు. ఏవైనా సినిమాలకు నచ్చలేదని చెప్పాల్సి వస్తే మేనేజర్ హ్యాండిల్ చేస్తాడని ప్రియదర్శి పేర్కొన్నారు.

నటుడిగా గుర్తింపు వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకున్నానని ప్రియదర్శి వెల్లడించారు. ప్రియదర్శి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటించిన ప్రియదర్శి ప్రస్తుతం కామెడీ పాత్రలకు పరిమితమయ్యారు. జాతిరత్నాలు మూవీ సక్సెస్ తో ప్రియదర్శికి సినిమా ఆఫర్ల సంఖ్య మరింత పెరిగింది.

ఎలాంటి పాత్ర ఇచ్చినా ప్రియదర్శి ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారని అందరూ భావిస్తారు. కెరీర్ విషయంలో ప్రియదర్శి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రియదర్శి రోజుకు 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లతో ప్రియదర్శి పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇతర కమెడియన్లకు భిన్నమైన పాత్రలను ప్రియదర్శి ఎంచుకుంటున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus