వైరల్ అవుతున్న ప్రియాంక చోప్రా కొత్త ఫోటోషూట్ పిక్స్

  • December 2, 2018 / 03:40 AM IST

బాలీవుడ్‌ నటీమణుల్లో ఎక్కువగా విజయం సాధించిన వారిలో ప్రియాంక చోప్రా ఒకరు. ఇటీవల ఆమె బాలీవుడ్‌ హీరోలకు దీటుగా సంపాదన ఆర్జిస్తున్నారు. 2017 ఫోర్బ్స్‌ ఇండియా టాప్‌ 10 సెలబ్రిటీల్లో ఉన్న ఒకే ఒక్క నటి ప్రియాంక మాత్రమే. అంతేకాక భారత్‌లో మాత్రమే కాక, అమెరికాలోనూ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈమె అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ క్వాంటికో మూడో పార్ట్‌లో నటిస్తోంది. త్వరలోనే హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లోనూ ప్రియాంక షూటింగ్‌ను ప్రారంభించబోతుంది.

అయితే.. డిసెంబ‌ర్ మూడో తేదిన వివాహం చేసుకోనున్న ప్రియాంకా చోప్రా త‌న కాబోయే భర్త నిక్ తో కలిసి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో బిజీగా ఉంది.. జోధ్ పూర్ లోని ఓ ప్యాలెస్ లో జరగబోయే వేడుక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇక ఆమె మేరేజ్ గిఫ్ట్ గా అంత‌ర్జాతీయ మ్యాగ్ జైన్ వోగ్ డిసెంబ‌ర్ నెల ఎడిష‌న్ లో ఆమెపై ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.. దీంతో పాటే క‌వ‌ర్ పై ఆమె బొమ్మ‌ను ముద్రించింది… ఈ ఘనత దక్కించుకున్న మొదటి భారతీయ మహిళగా పిసి ఘ‌న‌త సాధించింది.. ఆమె ఫోటో షూట్లను సోషల్ మీడియా వోగ్ సంస్థ అభిమానుల కోసం షేర్ చేసింది.. ధగధగలాడే బంగారు వర్ణం గౌన్ లో ప్రియాంకా మెరిసిపోతున్న‌ది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus