Balakrishna: బాలయ్య సీక్రెట్స్ వెల్లడించిన ప్రముఖ నిర్మాత!

  • February 21, 2022 / 05:35 PM IST

స్టార్ హీరో బాలకృష్ణకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారనే విషయం తెలిసిందే. అఖండ సక్సెస్ తో బాలయ్యకు క్రేజ్ మరింత పెరిగింది. ఏపీలో తక్కువ టికెట్ రేట్లు అమలవుతున్నా బాలయ్య అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో బాలయ్య గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. బాలయ్యను దూరంగా పెట్టి మీటింగ్స్ ఎప్పుడూ జరపలేదని సి.కళ్యాణ్ తెలిపారు.

Click Here To Watch

బాలకృష్ణ అంటే బాలకృష్ణ అని ఆయన చరిత్ర అని సినిమాలతో బాలయ్య ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారని సి.కళ్యాణ్ వెల్లడించారు. బాలయ్య మనసులో ఏదీ దాచుకోరని బాలయ్య చేసిన కామెంట్ల వల్ల ఇండస్ట్రీలో అందరూ కలిసికట్టుగా ఉన్నారని ప్రూవ్ అయిందని సి.కళ్యాణ్ పేర్కొన్నారు. బాలయ్య గారు లోపల ఏం అనుకుంటారో అదే బయటకు వస్తుందని ఆయన తెలిపారు. బాలయ్య ఇచ్చే మర్యాద అమోఘం అని సి.కళ్యాణ్ వెల్లడించారు. అతి వినయం చూపిస్తే అలా ఉండొద్దని బాలయ్య ముఖం మీదే చెబుతారని సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

బాలయ్య నుంచి ప్రేమ, గౌరవం నేర్చుకోవచ్చని ఆయన తెలిపారు. బాలయ్యను స్టార్ హోటల్ లో ఉంచితే రూమ్ సర్వీస్ నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించుకోరని కోట్ల రూపాయలు తీసుకునే హీరో 200 రూపాయల గురించి అలా ఆలోచిస్తారని అనవసర ఖర్చులు బాలయ్యకు నచ్చవని సి.కళ్యాణ్ తెలిపారు. ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తామంటే మాత్రం బాలయ్య బాబుకు అస్సలు నచ్చదని సి.కళ్యాణ్ వెల్లడించారు. నిర్మాత డబ్బును ఖర్చు చేసి వేస్ట్ చేయాలనే ఆలోచన బాలయ్యకు అస్సలు ఉండదని సి.కళ్యాణ్ తెలిపారు.

పరమవీరచక్రతో నేను లాభం పొందానని ఆ సినిమా జనాల ఊహలకు భిన్నంగా ఉందని సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రూలర్ సినిమాతోనే కొంత మొత్తం డబ్బులు పోయాయని సి.కళ్యాణ్ పేర్కొన్నారు. జైసింహా కూడా తనకు మంచి లాభాలను అందించిందని సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సి.కళ్యాణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus