పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డేట్స్ ఇస్తే వేగంగా రిలీజ్ అవ్వగలిగే సినిమా ఏదైనా ఉంది అంటే అది ‘ఓజీ’నే (OG Movie) అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకు మరో 20 రోజులు కాల్‌షీట్లు ఇస్తే సినిమా రిలీజ్ చేసేయొచ్చు అని అంటున్నారు కాబట్టి. ఈ సినిమా ఇటీవల కాలంలో గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై నిర్మాత డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అవి పుకార్లు కావు, దాదాపు నిజమే అని చెప్పేశారు.
‘ఓజీ’ సినిమా కోసం విజయవాడలో భారీ ప్లాన్స్ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అక్కడ సెట్స్ వేస్తున్నారనే ప్రచారమూ జరిగింది. పవన్ ఎప్పుడు కాల్షీట్లు ఇచ్చినా ఈజీగా షూటింగ్ చేసుకునేలా ఆయన ఉండే ప్రాంతానికి దగ్గర్లోనే షూటింగ్ లొకేషన్ ఏర్పాటు చేస్తున్నామని నిర్మాత దానయ్య తెలిపారు. ఈ లెక్కన త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని చెప్పొచ్చు.
ఈ క్రమంలో ‘ఓజీ’ సినిమా గురించి వస్తున్న పుకార్లను కూడా ఆయన క్లియర్ చేశారు. ‘ఓజీ’ సినిమా కోసం సుజీత్‌ను త్రివిక్రమ్ తీసుకొచ్చారనే ప్రచారంలో కొంత నిజముందని దానయ్య చెప్పారు. పవన్‌తో సినిమా చేస్తే ఓ కొత్త, స్టయిలిష్ సినిమా చేయాలనే ఉద్దేశంతో సుజీత్‌ను (Sujeeth) కాంటాక్ట్ అయ్యామని దానయ్య తెలిపారు. త్రివిక్రమ్ (Trivikram) , తాను దర్శకుడి గురించి డిస్కస్ చేసుకున్నాక సుజీత్‌ను తీసుకున్నాం అని చెప్పారాయన.
పవన్ కల్యాణ్ సినిమాల సంగతి చూస్తే.. ‘ఓజీ’ కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయి. క్రిష్ – జ్యోతి కృష్ణ (Jyothi Krishna ) ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ఒకటి కాగా, రెండోది హరీశ్ శంకర్ (Harish Shankar) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) . ఈ మూడింటిలో ఏ సినిమా ముందు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. కాబట్టి ఇదే ముందు అవ్వొచ్చు అంటున్నారు. మరి పవన్ మనసులో ఏముందో?