Chiranjeevi: ఎలాంటి రూమర్స్ నమ్మద్దు.. గాడ్ ఫాదర్ వచ్చేది అప్పుడే!

  • September 8, 2022 / 01:22 PM IST

పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ నటుడు మోహన్ లాల్ హీరోగా నటించినటువంటి చిత్రం లూసీఫర్. మలయాళంలో ఎంతో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు.మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. ఇక ఈ సినిమాలో సత్యదేవ్ నయనతార వంటి సెలబ్రిటీలు కూడా నటించారు. ఇప్పటికే ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమా నుంచి మెగాస్టార్ ఫస్ట్ లుక్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ సినిమా పై ఎన్నో అంచనాలను పెంచింది. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ సినిమా విడుదల విషయం గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా నిర్మాత ఎన్.వి. రమణ ఈ సినిమా విడుదల గురించి స్పందిస్తూ సినిమా విడుదల తేదీన అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ సినిమా విడుదల విషయంపై వస్తున్నటువంటి ఎలాంటి రూమర్స్ నమ్మద్దు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5వ తేదీ విడుదల కానుంది అంటూ ఈయన ఈ సినిమా విడుదల విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం డబ్బింగ్ పనులను మొదలుపెట్టారు.

మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెడతామంటూ ఈ సందర్భంగా నిర్మాత రమణ వెల్లడించారు.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సైతం అతిథి పాత్రలో సందడి చేయనున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus