Pawan Kalyan: స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఆ షో చేయకపోవడానికి కారణాలివేనా?

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పూర్తిస్థాయిలో పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే సెప్టెంబర్ నుంచి పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్ లలో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా షూటింగ్ సైతం 2025 జనవరి సమయానికి పూర్తి కానుందని సమాచారం అందుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఏదైనా రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తే రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ నమోదవుతాయనే సంగతి తెలిసిందే.

Pawan Kalyan

చాలా సంవత్సరాల క్రితం బాలీవుడ్ లో మంచి స్పందనను సొంతం చేసుకున్న సత్యమేవ జయతే ప్రోగ్రామ్ ను తెలుగులో పవన్ కళ్యాణ్ హోస్ట్ గా చేయాలని ప్లాన్ చేశారట. పవన్ కళ్యాణ్ సైతం ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి ఆసక్తి చూపించారట. అయితే అదే సమయంలో పవన్ జనసేన పార్టీని స్థాపించి పొలిటికల్ గా యాక్టివ్ కావడంతో ఆ షో చేయడానికి పవన్ వెనుకడుగు వేశారట.

పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరు ఆ షో చేసినా ఆ రేంజ్ లో క్లిక్ కాదని భావించి హిందీ ఎపిసోడ్లను డబ్ చేసి తెలుగులో ప్రసారం చేయడం జరిగింది. అమీర్ ఖాన్ హిందీలో ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ వరుస షూటింగ్ లతో బిజీ అయితే ఆయన అభిమానులు ఎంతో సంతోషిస్తారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ లన్నీ భారీ ప్రాజెక్ట్ లు కావడం గమనార్హం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీ అయినా పొలిటికల్ కార్యక్రమాలకు సైతం ఎక్కువగానే ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా పవన్ సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆయన రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పవన్ గబ్బర్ సింగ్ (Gabbar Singh)  మూవీ సోమవారం రోజున రీరిలీజ్ కానుంది.

బాలయ్య సినీ ప్రయాణానికి 50 ఏళ్లు.. ఆ హీరోలను ఆహ్వానిస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus