పవన్ కళ్యాణ్ ఓ ప్రక్క తన రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతూనే ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అసలు సినిమాలే చేయనని చెప్పిన పవన్ షూటింగ్స్ కొరకు జనాలకు దూరం అయితే ప్రజలలో ఇప్పటివరకు సంపాదించుకున్న కొద్దో గొప్పో గుడ్ విల్ పోతుందని ఆయన భావిస్తున్నారు. ఐతే పవన్ రాజకీయ కార్యక్రమాలు, షెడ్యూల్స్ ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ కి ఇబ్బందిగా మారాయట. ఢిల్లీ టూర్ కొరకు పవన్ కళ్యాణ్ రెండు రోజులు షూటింగ్ కి డుమ్మా కొట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ వెసులుబాటును బట్టి షూటింగ్ షెడ్యూల్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి కొనసాగుంతుందట.
ఈ పరిస్థితి దర్శక నిర్మాతలకు ఇబ్బందికరంగా మారిందట. ఐతే పవన్ స్వభావం రీత్యా ఆయనకు ఈ విషయం గురించి చెబుదామంటే… ఎక్కడ అసలుకే ఎసరు పెడతారోనని నిర్మాతలు గమ్మున ఉండిపోతున్నారట. పవన్ తాజా వ్యవహారంలో దర్శక నిర్మాతలు కక్కలేక మింగలేక ఉన్నారని ఇండస్ట్రీ టాక్. పవన్ కమిట్ అయిన సినిమాలలో పింక్ రీమేక్ షూటింగ్ ఎప్పుడో మొదలుకాగా త్వరలో పూర్తికానుంది. సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేసేందుకు, నిర్మాతలు ప్రణాళికలు వేసుకున్నారు. అలాగే దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం కలదు. తాజా పరిణామాలు చూస్తుంటే పవన్ సినిమాలు అనుకున్న తేదీలలో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
Most Recommended Video