‘ఫిదా’ చిత్రంతో ఓ రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకుంది సాయి పల్లవి. తరువాత ఈమె నటించిన ‘ఎం.సి.ఏ’ చిత్రంతో కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూలు కడుతున్నారు. కానీ ఈమె ఆటిట్యూడ్ వల్ల టాప్ హీరోయిన్ గా ఎదగలేకపోయిందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చాలా మంది డైరెక్టర్లు కథ చెప్పడానికి వెళ్ళినా… సరిగ్గా పట్టించుకోదట. కథ విన్నా కూడా… తనకు ప్రాధాన్యత లేదంటూ చాలా కథలు రిజిక్ట్ చేస్తుండడంతో ఆమెకు కథలు చెప్పడానికి కూడా ఇప్పుడు కొందరు యంగ్ దర్శకులు భయపడిపోతున్నారట.
మరోపక్క సాయిపల్లవిని దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ ఓరియంటెడ్ కథలు రాయాలని… హీరోల ప్రాముఖ్యత ఎక్కువ ఉంటే తగ్గించాలని సలహాలు కూడా ఇస్తుందట. హిట్లు లేకపోయినా… ఆఫర్లు లేకపోయినా… వచ్చిన ఆఫర్లను ఇలా ఎందుకు చెడగొట్టుకుంటుందో అర్థంకావట్లేదని ఆమె సన్నిహితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. గతంలో నిత్యామీనన్ కూడా ఇదే తరహాలో ప్రవర్తించేదట. ఇప్పుడు సాయిపల్లవి కూడా ఆమె లానే ప్రవర్తిస్తుందని కూడా వారు చెప్పుకొస్తున్నారు.