శౌర్య తన ప్రవర్తన మార్చుకోవాలి!

యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. నాగశౌర్య సినిమాల్లోకి రాకముందు ‘నీ జతలేక’ అనే సినిమాలో నటించాడు. సుమారుగా ఆరేళ్ళ క్రితం చిత్రీకరించిన ఈ సినిమా కొన్ని కారణాల వలన అప్పుడు విడుదల చేయలేదు. ఆ తరువాత నాగశౌర్య ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి రెండు, మూడు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే శౌర్య నటించిన మొదటి సినిమా ‘నీ జతలేక’ను ఇప్పుడు విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు చిత్రనిర్మాతలు.

ఆ సినిమా రిలీజ్ అవ్వడం శౌర్యకు ఇష్టం లేదన్నట్లుగా ప్రవర్తించడం ఆశ్చర్యంగా ఉంది. ప్రమోషన్స్ కు కూడా ఏదో ఆబ్లిగేషన్ మీద వచ్చినట్లు అర్ధమయిపోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన శౌర్య ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు.

అంతేకాదు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడని ప్రశ్నించగా.. మన హీరో గారు పోస్టర్ ఎక్కడుందా..? అని వెతుక్కుంటుంటే ఈ సినిమాపై ఎంత ఆశ్రద్ధంగా ఉన్నాడో… ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పటికైనా.. తన ప్రవర్తన మార్చుకొని బాధ్యతగా వ్యవహరిస్తే శౌర్య కెరీర్ కు మంచిది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus