‘బాహుబలి’ చేస్తున్న టైంలోనే ‘సైజ్ జీరో’ అనే చిత్రాన్ని చేయడానికి ఓకె చెప్పింది అనుష్క. ‘బాహుబలి ది బిగినింగ్’ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ‘సైజ్ జీరో’ కోసం వెయిట్ పెరగడం మొదలుపెట్టింది. ఆ సినిమాని ఎంతో మనసు పెట్టి చేసింది. కానీ అనుష్కకి మంచి ఫలితం దక్కకపోగా ట్రోలింగ్ కు గురైంది.అప్పటినుండీ అనుష్క చీటికీ మాటికీ వెయిట్ పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. ‘భాగమతి’ తర్వాత ‘నిశ్శబ్దం’ కోసం వెయిట్ తగ్గింది అనుష్క.
ఆ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ రెండు చిత్రాలు నిర్మాతలకు లాభాల్ని తెచ్చిపెట్టాయి. అయితే ఆ సినిమాల తర్వాత అనుష్క మళ్ళీ వెయిట్ పెరిగింది. అందువల్ల ఆమె ఏ సినిమా చేయడానికి అంగీకరించడం లేదు. ఏ పెద్ద సినిమా డైరెక్టర్ అయినా వచ్చి కథ చెబితే చేస్తాను అని చెబుతుందట. కాకపోతే ఆమె వెయిట్ గురించి మాట్లాడితే ఆ ప్రాజెక్టుని సున్నితంగా తిరస్కరించేస్తుందట స్వీటీ. ప్రస్తుతం ‘యూవీ క్రియేషన్స్’ లో ఈమె ఓ సినిమా చేయాల్సి ఉంది.
నవీన్ పోలిశెట్టి అందులో హీరో. ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అనుష్క లేని సన్నివేశాలు తీస్తున్నారు. కానీ అనుష్క మాత్రం ఇంకా షూటింగ్లో జాయిన్ అవ్వలేదు. 2నెలల తర్వాత షూటింగ్లో జాయిన్ అవుతాను అంటుందట. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలో అనుష్క ‘మిర్చి’ ‘భాగమతి’ వంటి రెండు సినిమాలు చేసింది. అవి రెండు హిట్ అయ్యాయి.పైగా యూవీ వాళ్ళతో అనుష్క కి మంచి సాన్నిహిత్యం ఉంది.
కాబట్టి సింపుల్ గా వాళ్ళు అనుష్క రెండు నెలల తర్వాత షూటింగ్ కు వస్తాను అంటే ఓకె చెప్పేస్తున్నారు. అనుష్క ఆల్రెడీ ఆస్ట్రేలియాలో బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకుంది. కానీ అది వికటించింది. దీంతో ‘నిశ్శబ్దం’ చిత్రానికి తీసుకున్న పద్దతిలో ఆమె సన్నపడడానికి ట్రీట్మెంట్ తీసుకోవాలని భావిస్తోంది.దానికి కచ్చితంగా 2 నెలల పైనే టైం పడుతుంది.