Project K: ప్రాజెక్ట్ కే ట్విస్టులు అలా ఉండబోతున్నాయా.. ప్రభాస్ అలా మెప్పించనున్నారా?

  • July 15, 2023 / 05:08 PM IST

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబో మూవీ ప్రాజెక్ట్ కే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ రాకపోవడంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు ప్రచారంలోకి వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ప్రాజెక్ట్ కే సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని

ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ సీన్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ పాత్ర భవిష్యత్తులోకి వెళ్లిన మరో ప్రభాస్ పాత్ర కనిపిస్తుందని భోగట్టా. ఆదిత్య 369లో కొంత సమయం పాటు బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించి తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్ పాత్రను సైతం ఇదే విధంగా ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది.

ప్రాజెక్ట్ కే మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వచ్చే వారం రిలీజ్ కానుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎలా తెరకెక్కించారో చూడాల్సి ఉంది. అమితాబ్, కమల్ ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఈ సినిమా ఆ అంచనాలను మించి ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రాజెక్ట్ కే (Project K) సినిమా హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ నెలకొనగా ఈ సినిమాకు ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో చూడాల్సి ఉంది. ప్రాజెక్ట్ కే సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమాలో ఎన్నో పత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus