ఓవైపు పవన్ కల్యాణ్ టీమేమో ‘ఓజీ 2’ అంటుంటే.. మరోవైపు దర్శకుడు సుజీత్ మాత్రం ‘బ్లడీ రోమియో’ అంటున్నారు. నిజానికి ఈ సినిమానే ముందు అనౌన్స్ చేశారు.. కాబట్టి ఈ సినిమానే ముందు షూటింగ్ ప్రారంభించుకోవాలి. ఇప్పుడు అదే పని కూడా జరుగుతోంది అని అంటున్నారు. ఈ క్రమంలో సినిమాలో మెయిన్ నటుల కాస్టింగ్ పనులను సుజీత్ టీమ్ వేగవంతం చేశారు అని సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ను సంప్రదించారు అని చెబుతున్నారు.
సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని.. అయితే అది విలన్ పాత్ర కాదని సమాచారం. సినిమాలో అతిథి పాత్ర కంటే ఓ పెద్ద పాత్ర ఉందని.. దాని కోసం పృథ్వీరాజ్ సుకుమారన్‌ని సంప్రదించారు అని చెబుతున్నారు. అయితే ఆయన ఇంకా పరిశీలిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ చేతిలో ‘వారణాసి’ సినిమా ఒకటే ఉంది. అది ఎప్పుడు షూటింగ్ ఉంటుందో, ఎప్పుడు ఉండదో చెప్పలేని పరిస్థితి. ఇది కాకుండా ‘సలార్ 2’ సినిమా కూడా చేతిలో ఉంది.
ఆ రెండు సినిమాలకు డేట్స్ ఇవ్వాల్సి వస్తే.. ‘బ్లడీ రోమియో’ సినిమాకు డేట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. కాంబినేషన్ సీన్స్ డేట్స్ విషయంలో ఇబ్బందులు కూడా ఓ కారణమని చెప్పొచ్చు. మరి అన్నీ సర్దుకుంటాను అనే నమ్మకం వచ్చినప్పుడు ఈ సినిమాకు డేట్స్ ఇస్తారు అని చెప్పొచ్చు. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ శాతం అమెరికాలో ఉంటుంది అని చెబుతున్నారు.
డీవీవీ దానయ్య నిర్మించాల్సిన ‘బ్లడీ రోమియో’ సినిమాను వివిధ కారణాల వల్ల బోయినపల్లి వెంకట్ నిర్మిస్తున్నారు. గతంలో నానితో ఆయన ‘శ్యామ సింగ రాయ్’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే..