పవన్ సినిమా కథపై చక్కర్లు కొడుతున్న అనేక రూమర్లు!

Advertisement

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఓ రేంజ్ లో అంచనాలు ఉంటాయి. పైగా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్ ని త్రివిక్రమ్ మార్చారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ని తీసుకున్నారు. అతను కంపోజ్ చేసిన “బైటి కొచ్చి చూస్తే..” సాంగ్ యువతని ఓ ఊపు ఊపింది. అంతేకాదు యూరప్ షెడ్యూల్ కి సంబంధించిన ఫోటోలు నెట్లో విహారం చూస్తున్నాయి. ఈ ఫోటోలను చూసి అభిమానులు తమకి తోచిన విధంగా కథను అనుకుంటున్నారు. విక్టరీ వెంకటేశ్ నటించిన “ఒంటరి పోరాటం” సినిమా కథను పోలి ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. అందుకే ఇందులో వెంకటేష్ గెస్ట్ రోల్ చేశారని నమ్ముతున్నారు. మరికొంతమంది మాత్రం ఫ్రెంచ్ మూవీ “ద హెయిర్ అప్పారెంట్” నుంచి ఈ సినిమా కథను త్రివిక్రమ్ తీసుకున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

మరి వీటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ట్రైలర్ రావాల్సిందేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. ట్రైలర్ రిలీజ్ కి మరో నెల సమయం పడుతుంది. వచ్చే నెల (డిసెంబర్‌)లో ఆడియో, ట్రైలర్ విడుదల చేసి సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు. సో పవన్ ఫ్యాన్స్  పెద్ద పండుగను మరింత ఆనందంగా ఎంజాయ్ చేయనున్నారన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus