డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ మొత్తానికి పాన్ ఇండియా ఫార్మాట్ లోకి వచ్చేశాడు. లైగర్ సినిమాను ఇటీవల పూర్తి చేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఆ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చాలా బిజీగా ఉన్నప్పటికీ దర్శకుడు పూరి జగన్నాధ్ భవిష్యత్ కు సంబంధించిన ప్రాజెక్ట్ లపై కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండతోనే జనగణమన ప్రాజెక్టును ఓకే చేయించినట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా పూరి ఆ ప్రాజెక్టును తీసుకురావాలని అనుకుంటున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ మహేష్ తో చర్చలు జరిగినప్పటికీ ప్లాన్ అయితే సక్సెస్ కాలేదు. ఇక విజయ్ దేవరకొండ తో ఎలాగైనా జనగణమన ప్రాజెక్టును తీసుకురావాలని అనుకుంటున్నాడు. అయితే పూరి మనసులో ఒక ఫ్యాన్ వరల్డ్ తెలుస్తోంది. ఆ సినిమాను హాలీవుడ్ రేంజ్ లోనే తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడట.
లైగర్ జనగణమన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటాయని ఆయన చాలా నమ్మకంతో ఉన్నాడు. ఇక ఆ తర్వాత అంతకుమించి పాన్ వరల్డ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. ఇక ఆ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో గతంలో అయితే పూరి జగన్నాథ్ కేజిఎఫ్ హీరో యష్ ను కూడా కలవడం జరిగింది.
చర్చలు కూడా జరుగుతున్నాయను చాలా సార్లు యష్ కూడా వివరణ ఇచ్చాడు. అలాగే పూరి జగన్నాథ్ తో ప్రభాస్ కు కూడా సాన్నిహిత్యం ఉంది. ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో అయితే ఈ ఇద్దరు హీరోలు అగ్రస్థానంలో ఉన్నారు అని చెప్పవచ్చు. ప్రభాస్ తర్వాత ఎక్కువగా యష్ తోనే సినిమాలు చేయాలని చాలామంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. ఇక పూరీ జగన్నాథ్ తన హాలీవుడ్ సినిమా కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనే విషయంలో ఆసక్తిగా మారింది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!