సినిమా అనౌన్స్‌ చేశారు.. డేట్‌ కూడా చెప్పేశారు!

  • May 15, 2023 / 09:39 AM IST

పూరి జగన్నాథ్‌ కొత్త సినిమా ఏంటి? ఈ మాట మనం వినడం కొత్తేమీ కాదు. ఆయనకు ఫ్లాప్ రావడం ఆలస్యం.. కొత్త సినిమా ఎప్పుడ, ఎవరితో, ఎక్కడ అంటూ ఆరాలు మొదలవుతాయి. ఏ డైరక్టర్‌కైనా సినిమా ఫ్లాప్‌ అయితే కొత్త సినిమా గురించి ఆలోచనలు రావడానికి, ఆలోచనలు చేయడానికి చాలా టైమ్‌ పడుతుంది. ఫ్యాన్స్‌, సినిమా జనాలు కూడా కాస్త టైమ్‌ తీసుకుంటారు. కానీ పూరి దగ్గర అలా ఉండదు. ఫ్లాప్‌ను త్వరగా మరచిపోయి.. కొత్త సినిమా పనుల్లో పడతారు. అయితే ‘లైగర్’ తర్వాత ఆయన లెక్క తేలలేదు.

ఈ క్రమంలో పూరి జగన్నాథ్‌ కొత్త సినిమా హీరో అతను, ఇతను అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. చిరంజీవి అయితే డైరెక్ట్‌గా ‘నాతో సినిమా ఎప్పుడు పూరి’ అని అడిగేశారు కూడా. మంచి కథ రెడీ చేస్తున్నా.. త్వరలో కలుస్తా అని అన్నారు పూరి. కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్ట్‌ సంగతి తెలియదు. మరోవైపు బాలకృష్ణతో సినిమా అంటూ వార్తలొచ్చాయి. కానీ అది కూడా అవ్వలేదు. దీంతో పూరి కొత్త సినిమా విషయంలో చర్చలు, ఉపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాటికి ఆదివారం ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు.

గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లను నిజం చేస్తూ సినిమా టీమ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ అంటూ ఓ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేసేసింది. అంతే కాదు. ఈ సినిమాను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8, 2024న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. రామ్‌ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చి భారీ విజయం అందుకున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు ఇది సీక్వెల్‌. అందులో డబుల్‌ మైండ్‌ శంకర్‌ను చూపించారు. ఇప్పుడు డబుల్‌ ఇస్మార్ట్‌ కాబట్టి.. నాలుగు మైండ్స్‌ చూపిస్తారేమో అనే జోకులు కూడా వినిపిస్తుననాయి.

సోమవారం రామ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ స్క్రిప్ట్ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సెట్స్‌ మీద ఉన్నప్పుడే మొదలయ్యిందట. ఇప్పుడు చక్కగా ఫైనల్ వెర్షన్ పూర్తి చేసినట్టు టాక్. అయితే ఇప్పుడే డేట్‌ ప్రకటించి తమను తాము లాక్‌ చేసుకున్నారా? సాధ్యమేనా అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే రామ్‌ – బోయపాటి సినిమా ఇంకా పూర్తవ్వలేదు. అదయ్యాక సినిమా స్టార్ట్‌ చేస్తే ఆరు నెలల్లో అంతా సిద్ధం చేసేయాలి. అయితే పూరి ఇలాంటి రిలీజ్‌లు, సినిమాలు గతంలో చాలానే చేశారు కాబట్టి.. ఆయనకు పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus