Pushpa 2: యావరేజ్ టాక్ తో ‘పుష్ప 2’ ఆ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తుందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్  (Sukumar)  దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’  (Pushpa) చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. 2021 లో విడుదలైన ఈ సినిమా తెలుగులో అంతంత మాత్రమే ఆడినప్పటికీ.. హిందీలో బ్లాక్ బస్టర్ అయ్యి ఏకంగా రూ.108 కోట్లు నెట్ కలెక్షన్స్ ని సాధించి చరిత్ర సృష్టించింది. తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా హిట్ అనిపించుకుంది. ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లు సాధించింది. దీంతో సెకండ్ పార్ట్ పై హైప్ ఏర్పడింది.

Pushpa 2

అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ‘పుష్ప 2’ (Pushpa 2)   తీర్చిదిద్దుతున్నారు సుకుమార్. కొన్ని నెలలుగా రోజుకో వార్తతో ‘పుష్ప 2’ ట్రెండింగ్లో నిలుస్తుంది. వాస్తవానికి ఆగస్టు 15 నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వకపోవడంతో పోస్ట్ పోన్ అయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ గడ్డం తీసేసి హాట్ టాపిక్ అయ్యాడు.

ఇక ఇటీవల ‘దేవి శ్రీ ప్రసాద్ ని (Devi Sri Prasad) తప్పించి తమన్ (S.S.Thaman), శామ్ సి ఎస్ (Sam C. S.), అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath) వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టిస్తున్నాడు సుకుమార్’ అనే ప్రచారంతో వార్తల్లో నిలిచి మరింత హాట్ టాపిక్ అయ్యింది ‘పుష్ప 2’ ఇదిలా ఉండగా.. ‘పుష్ప 2’ కి రూ.900 కోట్లు బిజినెస్ జరిగింది అంటూ ఇటీవల నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో ట్రేడ్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది ‘పుష్ప 2’. ఇప్పుడు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను బట్టి… వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. నార్త్ లో ఈ సినిమా ‘కె.జి.ఎఫ్ 2’ రేంజ్లో ఓపెనింగ్స్ ను రాబడుతుందట. చూడాలి మరి.. ‘పుష్ప 2’ ఆ రేంజ్లో రాబడుతుందో లేదో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus