Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ లుక్ ఇదేనా.. వైరల్ అవుతున్న పిక్!

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఈ చిత్రాన్ని అతనే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మంచు విష్ణు (Manchu Vishnu) ఈ మధ్య ఫామ్లో లేడు. అతను హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. అయితే ఈ సినిమాపై ఆడియన్స్ దృష్టి పెట్టడానికి కారణం ఒక్కటే. ఇందులో సౌత్, నార్త్..కి చెందిన స్టార్లు నటిస్తుండటం వల్ల. అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్.. వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

Prabhas

అందరి కంటే ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) నటిస్తున్నాడు. అతను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కన్నప్ప సినిమా ట్రేడ్లో హాట్ టాపిక్ అవ్వడానికి కూడా కారణం అతనే. ప్రభాస్ (Prabhas) సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ ఈజీగా కొట్టేస్తాయి. ‘కన్నప్ప’ లో అతను మెయిన్ రోల్ కాకపోయినా.. అతన్ని బట్టి మొదటి రోజు రూ.50 కోట్ల గ్రాస్ అయినా కొడుతోంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.

అయితే ‘కన్నప్ప’ లో ప్రభాస్ (Prabhas) ఏ పాత్ర చేస్తున్నాడు అనే విషయం పై ఇప్పటికీ క్లారిటీ లేదు.మొదట శివుడు అన్నారు. తర్వాత నందీశ్వరుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నాడు అనే టాక్ కూడా వినిపించింది. కానీ చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.

ప్రభాస్ పాత్రని ప్రత్యేకంగా ఓ ఈవెంట్ పెట్టి.. రివీల్ చేయాలని మంచు విష్ణు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ‘కన్నప్ప’ లోని ప్రభాస్ లుక్ కి సంబంధించిన ఓ పిక్ లీక్ అయ్యింది. కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారిపోయింది.

ప్రభాస్ కి బాగానే గాలం వేశారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus