Pushpa Collections: ‘పుష్ప’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  మేనియా నడుస్తుంది. ఇది ‘పుష్ప'(ది రైజ్) కి సీక్వెల్. అయితే ‘పుష్ప'(ది రైజ్)  (Pushpa)  రిలీజ్ అయ్యి నేటితో 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం 2021 డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు దాదాపు రూ.250 కోట్లు బడ్జెట్ తో నిర్మించారు. మొదట ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

Pushpa Collections:

అయితే నార్త్ లో సూపర్ హిట్ టాక్ వచ్చింది. అక్కడ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా తర్వాత పికప్ అయ్యింది. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఒకసారి ‘పుష్ప'(ది రైజ్) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 37.10 cr
సీడెడ్ 15.00 cr
ఉత్తరాంధ్ర  8.03 cr
ఈస్ట్  4.89 cr
వెస్ట్  4.14 cr
గుంటూరు  5.34 cr
కృష్ణా  4.25 cr
నెల్లూరు  3.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 82.00 cr
తమిళ్ నాడు 10.90 cr
కేరళ   5.30 cr
కర్ణాటక  10.70 cr
రెస్ట్  42.00 cr
ఓవర్సీస్  14.25 cr
టోటల్ వరల్డ్ వైడ్ 165.15 cr

‘పుష్ప'(ది రైజ్) రూ.146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.165.15 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా రూ.19.15 కోట్ల లాభాలతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. మొత్తంగా సూపర్ హిట్ మూవీ అనే చెప్పాలి.

అమీర్ ఖాన్.. రాజమౌళి కంటే ముందే ఆ కథపై పవర్ఫుల్ ప్లాన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus