Rajamouli: ఎన్టీఆర్ గురించి అప్పుడు, ఇప్పుడూ ఓకే మాట!

మనిషన్నాక మాట మీద నిలబడాలి అంటారు. అయితే.. ఫిలిం ఇండస్ట్రీలో ఇలా మాట మీద నిలబడే వ్యక్తులు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. అసలు ఒకసారి చెప్పిన మాటను మరోసారి గుర్తుపెట్టుకోవడమే కష్టం. కానీ రాజమౌళి (S. S. Rajamouli)  మాత్రం 2017లో తాను ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఇప్పటికీ కుర్చీ వేసుకొని మరీ కూర్చున్నాడు. ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గురించి తెలియనివారుండరు. సదరు షోలో 2017 సమయంలో రాజమౌళి రాధాకృష్ణతో మాట్లాడుతూ..

Rajamouli

సీనియర్ ఎన్టీఆర్ ను (Sr NTR) తాను నటుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువగా ఇష్టపడతాను అని చెప్పిన విషయం అప్పట్లో వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఆయన సినిమాలు పెద్దగా ఎక్కేవి కాదు రాజమౌళి చెప్పడం చాలామందిని హర్ట్ చేసాయి. అయితే.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ది రానా దగ్గుబాటి షోలో మాట్లాడుతూ కూడా అదే మాట మీద నిలబడుతూ “ఎన్టీఆర్ గారి దర్శకత్వం అంటేనే ఇష్టం, మహాభారతాన్ని ఆయన అర్థం చేసుకున్న కోణం భలే ఉంటుంది” అంటూ రాజమౌళి చెప్పిన విషయాలు భలే ఆసక్తికరంగా ఉన్నాయి.

సాధారణంగా అందరూ ఎన్టీఆర్ ను హీరోగా మాత్రమే అభిమానిస్తారు, ఆరాధిస్తారు. కానీ.. ఒక దర్శకుడిగా ఆయన్ను ఇష్టపడే జనాలు చాలా తక్కువ. కానీ.. దర్శకధీరుడు రాజమౌళి మాత్రం ఆయన్ని ఒక దర్శకుడిగా గౌరవించడం అనేది రాజమౌళి దృష్టికోణాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేసింది.

ఇకపోతే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే తదుపరి చిత్రమైన #SSRMB29 షూటింగ్ జనవరి 25 నుండి మొలవ్వనుందని సమాచారం. మహేష్ బాబు ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా నెలలుగా ప్రిపేర్ అవుతున్నాడు. మరి రాజమౌళి తన స్టైల్లో ప్రెస్ మీట్ పెట్టి ఎప్పడు పెట్టి ఎనౌన్స్మెంట్ ఇస్తాడా అని సినిమా అభిమానులు అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

అప్పుడు తీసిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus