అతను నా కథని చూశాడు కానీ.. రూపాన్ని చూడలేదు!

‘ప్రతిభకి రూపంతో పనిలేదు’ అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇదే డైలాగ్ ని పలు సినిమాల్లో కూడా విన్నాం. అయితే ఓ కమెడియన్.. స్టార్ డైరెక్టర్ గురించి చేసిన చీప్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ఆ కమెడియన్ ని ఓ రేంజ్లో విమర్శిస్తున్నారు నెటిజన్లు. విషయంలోకి వెళితే.. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) అందరికీ సుపరిచితమే. ‘రాజా రాణి’ (Raja Rani) ‘పోలీస్’ (Police) ‘అదిరింది (Adirindi) ‘ ‘విజిల్’ (Bigil) వంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు దర్శకుడు అట్లీ.

Atlee

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తో ‘జవాన్’ (Jawan) అనే సినిమాని తెరకెక్కించి పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్నాడు. వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన మొదటి తమిళ దర్శకుడు.. అంతేకాదు మొదటి తమిళ స్టార్ అని కూడా అట్లీ గురించి చెప్పుకోవాలి.అలాంటి అట్లీని ఓ కమెడియన్ అందం గురించి విమర్శించడం విషాదానికి గురి చేసే అంశంగా చెప్పాలి. అసలు విషయానికి వస్తే.. కపిల్ శర్మ టాక్ షోకి అట్లీ హాజరయ్యాడు.

ఇందులో భాగంగా.. ‘మీకు మొదటి ఛాన్స్ ఎలా వచ్చింది? మీతో పనిచేసే హీరోలు,నిర్మాతలు మీరు ఎదురుగా ఉన్నా అట్లీ ఎక్కడ?’ అని అడిగిన సందర్భాలు ఉన్నాయా? అంటూ పరోక్షంగా అట్లీ రూపం గురించి విమర్శలు చేశాడు. వీటిని గ్రహించిన అట్లీ.. “మీరు ఏమంటున్నారో నాకు అర్థమైంది. కానీ నా అదృష్టం కొద్దీ.. నా మొదటి కథ మురుగదాస్ కి ఇచ్చినప్పుడు..

అతను కథనే చూశారు కానీ నా రూపాన్ని చూడలేదు” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. వరుణ్ ధావన్  (Varun Dhawan )  , కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటించిన ‘బేబీ జాన్’ (Baby John) సినిమాకి అట్లీ కథ అందించారు. కాలీస్ దీనికి దర్శకుడు. తమిళంలో అట్లీ తెరకెక్కించిన ‘తేరి’ కి ఇది రీమేక్.ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అట్లీ (Atlee) పాల్గొనాల్సి వచ్చింది.

ఎన్టీఆర్ గురించి అప్పుడు, ఇప్పుడూ ఓకే మాట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags