మంచు ఫ్యామిలీలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు(Mohan Babu) , విష్ణు (Manchu Vishnu) ..లతో మనోజ్ కి (Manchu Manoj) అస్సలు పడటం లేదు. అది ఎందుకు అనే విషయాన్ని మనోజ్ చెప్పడం లేదు కానీ.. అతని తండ్రి మోహన్ బాబు పై అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. విష్ణుపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎందుకో విష్ణుపై మాత్రం ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ అవ్వడం లేదు అని వినికిడి. నిన్నటికి నిన్న మనోజ్…
తన ఇంట్లో చేసుకున్న పార్టీని విష్ణు తన మనుషులతో వచ్చి డిస్టర్బ్ చేసినట్టు కంప్లైంట్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. తాజాగా మనోజ్ గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక(భూమా) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈ జంట పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘జనసేన’లో చేరబోతున్నారని తెలుస్తుంది.
నంద్యాల నుండి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది.ఈరోజు భూమా ఘాట్ సందర్శన తర్వాత మనోజ్, మౌనిక..ల రాజకీయ నిర్ణయం వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 టైంలో మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్న టైంలో కూడా అతని పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ వాటిని మనోజ్ కొట్టిపారేశాడు.
‘సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్టు’..ఆ టైంలో మనోజ్ తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ కి మనోజ్ మొదటి నుండి క్లోజ్ గా ఉంటూ వస్తున్నాడు. ఇటీవల అతనికి ఎదురైన సమస్యల కారణంగా స్నేహితుడు సాయి దుర్గ తేజ్ సలహాతో ‘జనసేన పార్టీలో చేరాలని’ మనోజ్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.