భారతీయ సినీ పరిశ్రమలో ‘మహాభారతం’ను సినిమా గా తెరకెక్కించాలనే ఆసక్తి గత కొంతకాలంగా పెరిగిపోయింది. బాలీవుడ్ ప్రముఖ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) , టాలీవుడ్ లో రాజమౌళి(S. S. Rajamouli), ఈ కలను తమ ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ గా భావిస్తున్నారు. ఈ విషయంలో వీరిద్దరూ తమ అభిప్రాయాలను పలు సందర్భాల్లో పంచుకున్నారు. కానీ వాళ్లు ఎప్పుడూ దీనిపై తొందరపడటం లేదని, కేవలం అనుభవం ఇంకా పెరిగిన తర్వాతే మహాభారతాన్ని తెరపై రాబట్టాలని నిర్ణయించారు.
రాజమౌళి విషయానికి వస్తే, ఆయన ఈ సినిమాను ఒక్కటి లేదా రెండు భాగాలలో కాకుండా, దాదాపు విస్తారంగా అనేక భాగాలుగా తెరపైకి తీసుకు రావాలనే ఆలోచిస్తున్నారు. తన ఆలోచనలతో ఆ సినిమా చేస్తే అది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అయితే అలాంటి సినిమా చేయడానికి ఇంకా అనుభవం, కథలపై గొప్ప విశ్లేషణ అవసరమని, అందుకోసమే మహాభారతం పై పని చేసే ముందు మరింత సాధన కావాలని చెప్పారు.
అమీర్ ఖాన్ (Aamir Khan) కూడా ఈ ప్రాజెక్ట్ పై ఇలాంటి ఆలోచనలనే ఉన్నట్లు ఓ క్లారిటీ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా, ఆయన “లాపత్తా లేడీస్”(Laapataa Ladies) ప్రాజెక్ట్ కోసం ఆస్కార్ నామినేషన్ పొందిన నేపథ్యం లో ఎక్కువగా మీడియా ముందుకు వస్తున్నారు. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మహాభారతం గురించి కూడా మాట్లాడారు. ఆయన ఈ ప్రాజెక్ట్ ను కేవలం నిర్మించడం కాకుండా, నటుడిగా, నిర్మాతగా కూడా చేయాలని భావిస్తున్నారు.
ఈ సినిమా గురించి అమీర్ (Aamir Khan) మాట్లాడుతూ, భారతీయులందరి రక్తంలో ఈ కథ ఉందని, ప్రపంచానికి భారతదేశం గొప్పదనాన్ని చూపించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. బాధ్యతతో పాటు భయం కూడా ఉందంటూ.. ఒకవేళ స్టార్ట్ చేస్తే గనుక చిన్న తప్పు కూడా దొర్లకుండా పూర్తి చేయాలని అనుకుంగున్నాను. అందుకే ఇంకాస్త ఎక్కువ సమయం అవసరం అని అమీర్ వివరణ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ, ఈ లెజెండరీ వ్యక్తులు కలిసి మహాభారతాన్ని రూపొందిస్తే, ఈ ప్రాజెక్ట్ మరింత విజయవంతం అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి డ్రీమ్ కాంబినేషన్ భవిష్యత్తులో కలుస్తుందో లేదో చూడాలి.