Pushpa Movie: బన్నీకే ఈ అరుదైన రికార్డులు సాధ్యమా?

Advertisement

ఐకాన్ స్టార్ బన్నీని అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారనే సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు మలయాళంలో సైతం బన్నీకి భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గత నెలలో పుష్ప మూవీ నుంచి దాక్కో దాక్కో మేక పాట విడుదలైన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ పాటకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అయితే ఈ పాట ద్వారా బన్నీ ఖాతాలో అరుదైన రికార్డు సొంతమైంది.

దేవి శ్రీ ప్రసాద్ ఐదు భాషల్లో ఐదుగురు సింగర్లతో ఈ పాటను పాడించగా అన్ని భాషల్లో ఈ పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో ఈ పాటకు ఏకంగా 36 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ స్థాయిలో వ్యూస్ సాధించిన పాట దాక్కో దాక్కో మేక మాత్రమే కావడం గమనార్హం. బన్నీ పుష్ప ట్రైలర్ తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో అని బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ దోస్తీ సాంగ్ కంటే ఈ సాంగ్ కే ఎక్కువ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. బన్నీకి జోడీగా రష్మిక నటిస్తుండగా సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప ది రైజ్ పేరుతో పుష్ప ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేశారని సమాచారం. పుష్ప బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus