Pushpa: పుష్పలో షాకింగ్ ట్విస్ట్ అదే కానుందా?

  • August 30, 2021 / 09:40 AM IST

సుకుమార్ డైరెక్షన్ లో ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ నటిస్తున్న పుష్ప అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందని బన్నీ ఫ్యాన్స్ తో పాటు సుకుమార్ ఫ్యాన్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీకి అన్న పాత్రలో పోలీస్ గా అజయ్ నటిస్తున్నాడని కొన్ని రోజుల క్రితం వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాత్రతోనే సుకుమార్ షాకింగ్ ట్విస్ట్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది.

రంగస్థలం సినిమాలో ఎవరూ ఊహించని విధంగా ఆది పినిశెట్టి పాత్రను చంపేసి సుకుమార్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. పుష్ప సినిమాలో కూడా అజయ్ పాత్ర చనిపోతుందని సమాచారం. బన్నీ కోసం అజయ్ తన ప్రాణాలను సినిమాలో త్యాగం చేస్తారని తెలుస్తోంది. అజయ్ పాత్ర ఎమోషనల్ గా ఉంటుందని ఈ పాత్రకు నటన పరంగా స్కోప్ కూడా ఉంటుందని సమాచారం. ఆర్య2 సినిమాలో విలన్ గా కనిపించిన అజయ్ పుష్ప సినిమాలో బ్రదర్ గా కనిపించడం గమనార్హం.

మరోవైపు పుష్ప మూవీ రిలీజ్ డేట్ విషయంలో డైలమా కొనసాగుతోంది. క్రిస్మస్ కు ఆచార్య రిలీజ్ అవుతున్నట్టు ప్రకటన వెలువడితే మాత్రం పుష్ప రిలీజ్ డేట్ ను మార్చుకోక తప్పదు. త్వరలో ఆచార్య రిలీజ్ డేట్ గురించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుష్ప మేకర్స్ మరోసారి స్పందించి రిలీజ్ డేట్ గురించి స్పష్టత ఇస్తే బాగుంటుందని బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పుష్ప మూవీలో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus