టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ పుష్ప సినిమాతో గ్రాండ్ గా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. హిందీలో భారీ క్రేజ్ ఉన్నట్లు డబ్బింగ్ సినిమాలతోనే అర్థమైపోయింది. ఇక ఆ క్రేజ్ బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు క్లిక్కవుతుందో చూడాలి. ఇక పుష్ప సినిమా ఫైనల్ షూటింగ్ పార్ట్ ను స్టార్ట్ చేశారు. జులై 7న సికింద్రాబాద్ లో 50 రోజుల షెడ్యూల్ ను మొదలుపెట్టగా అల్లు అర్జున్ ఎంట్రీ వీడియో వైరల్ గా మారింది.
ఖరీదైన రేంజ్ రోవర్ కార్ లో స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక సెట్స్ లోకి వెళ్లిన కొద్దీ నిమిషాలకే పుష్ప రాజ్ పాత్రలోకి చేంజ్ అయ్యాడు. నిజంగా సినిమాలో బన్నీ మెకోవర్ వండర్ అని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు.దర్శకుడు సుకుమార్ సాధారణంగా లోకల్ గా సినిమా చేస్తేనే ఒక రేంజ్ లో ఆలోచిస్తాడు. ఇక పాన్ ఇండియా అంటే ఆయన ఆలోచనా విధానం ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఇక రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు అనగానే అంచనాల డోస్ మరింత పెరిగింది. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా 250కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తోంది. ఇక దసరా సమయానికి ఫస్ట్ పార్ట్ ను రిలీజ్ చేసి వచ్చే ఏడాది చివరలో సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.