ఒలింపిక్ విజేతకు సినిమా వేడుకలో చేదు అనుభవం

  • September 20, 2016 / 10:05 AM IST

రియో ఒలింపిక్స్ 2016లో రజత పతక విజేత పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె తొలిసారి పాల్గొన్న సినిమా వేడుకలో అభిమానుల వల్ల ఇబ్బంది పడ్డారు. మాజీ ప్రధాని దేవ‌గౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, నిర్మాత హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన భారీ చిత్రం జాగ్వార్. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులతో పాటు, మంత్రి కేటీఆర్, క్రీడాకారిణి సింధు పాల్గొన్నారు. ఆడియో ఆవిష్కరణ అనంతరం సింధు వేదిక నుంచి కిందికి దిగే సమయంలో సెల్ఫీ కోసం కొంతమంది అభిమానులు  ఆమె చుట్టూ చేరారు. ఆమె వారితో నవ్వుతూ మాట్లాడేసరికి  చాలా వేగంగా ఫ్యాన్స్ ఎక్కువమంది గుమిగూడారు. ఊహించని పరిణామానికి  సింధు కంగారు పడ్డారు. ఆమె తల్లి దండ్రులు కూడా ఆందోళన చెందారు. వెంటనే రంగంలో దిగిన బౌన్సర్లు అతి కష్టం మీద ఆ గుంపుని పక్కకి జరిపారు. దీంతో సింధు సురక్షితంగా తన కారులోకి ఎక్కారు. ఈ అనుభవంతో ఆమె ఇక పబ్లిక్ ఫంక్షన్లో జాగ్రత్త పడనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus