ఇటీవల విడుదలైన ‘రాహు’ సినిమాలో హీరోయిన్ గా నటించిన క్రితి గార్గ్ మిస్ అయిందంటూ నిన్న మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై ‘రాహు’ సినిమా దర్శకుడు సుబ్బు హైదరాబాద్ పంజాగుట్టా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ ముంబై నుండి సందీప్ రెడ్డి వంగా పేరుతో ఓ కాల్ వచ్చిందని.. కథ వినడానికి ముంబై రావాల్సిందిగా చెప్పడంతో ఆమె ముంబై వెళ్లినట్లు చెప్పిన దర్శకుడు సబ్బు ఆమె వెళ్లినప్పటి నుండి ఫోన్ కలవడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన హీరోయిన్ క్రితి.. ముంబైలో తను క్షేమంగా ఉన్నట్లు చెప్పింది. నెట్వర్క్ సరిగ్గా లేని కారణంగా ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. దీంతో డైరెక్టర్ సుబ్బు కంగారుపడి పోలీసులను ఆశ్రయించారని చెప్పింది. సందీప్ రెడ్డి వంగా పేరుతో కాల్స్, మెయిల్స్ రావడంతో సుబ్బు భయపడిపోయి పోలీసులకు కంప్లైంట్ చేశారని వీడియోలో తెలిపింది. ఈ డ్రామాలో ప్రభాస్ పేరు రావడంతో అతడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ఫాలో అవుతారా అంటూ తిట్టిపోస్తున్నారు.