Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

ఇదిగో నా సినిమా టైటిల్‌ లీక్‌ అంటూ ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్‌లో చిరంజీవి ఓ లీక్‌ చేశారు. ‘కదిరి..’ కదా అంటూ చిరంజీవి చెప్పకనే సినిమా పేరు చెప్పేశారు. దీంతో సినిమా పేరు ఇది అంటూ రకరకాల పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అందులో చాలామంది చెప్పిన మాట ‘కదిరి కాకా’. ప్రాస బాగుందనో, సమాచారం ఉండటం వల్లనో వాళ్లు బాగానే చెప్పారు. ఎందుకంటే ఈ సినిమాకు ‘కాకా’ అనే పేరు పెట్టారు. మరి సినిమాలో ‘కాకా’ ముందు కదిరి ఉంటుందా? లేదా అనేది చూడాలి.

Raaka – Kaaka

ఇక అసలు విషయానికి వస్తే.. ‘కాకా’ సినిమా పేరు విషయానికొస్తే.. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ స్టైల్‌లో ఇది రెండో సినిమా కాబట్టి. తొలుత అల్లు అర్జున్‌ – అట్లీ సినిమాకు ‘రాకా’ అనే పేరు పెట్టారు. అప్పట్లోనే ఆ పేరుకు అర్థమేంటి అనే ప్రశ్న వచ్చింది. సినిమా టీమ్‌ నుండి ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. ఆ సంగతి తేలకముందే ‘కాకా’ అన పేరు పెట్టేశారు.

ఈ పదానికి అర్థం ఏంటి అనేది పెద్ద విషయం కాదు. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో తండ్రి తమ్ముడిని పిలవడానికి ‘కాకా’ అని పిలుస్తారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ‘ఏం కాకా? ఎట్లున్నావ్?’ అని పిలుస్తుంటారు. ఇక ఈ విషయం వదిలేస్తే ఇప్పుడు మిగిలిన సినిమాలు కూడా ఇలాంటి పేరుతోనే వస్తాయా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే టాలీవుడ్‌లో ఇలాంటి పేర్ల స్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది.

ఇక్కడ మరో పాయింట్‌ కూడా ఉంది. ‘రాకా’ అని మొదట అనౌన్స్‌ చేసిన సినిమా కంటే.. ఆ తర్వాత ‘కాకా’ అని అనౌన్స్‌ చేసిన సినిమా వచ్చేస్తోంది. అన్నట్లు రిలీజ్‌ చేసిన మూడు నిమిషాల టీజర్‌లో ఎక్కడా ‘కాకా’ అనే పేరు వినిపించలేదు. కాబట్టి ఈ పేరు ఎందుకు పెట్టారా అనేది తెలియదు. సినిమాలోనే చెబుతారేమో.

అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus