Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో ‘రాకా'(Raaka) అనే ఫాంటసీ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండే భారీ హైప్ ఏర్పడింది. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది సన్ సంస్థ. 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి లీక్స్ బయటకు రాలేదు. అయితే 37 అంటూ చిత్ర బృందం 2 రోజుల నుండీ హడావిడి చేస్తుంది.

Raaka

దానికి అర్దం ఏంటని చాలా చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికి ఆ సస్పెన్స్ కి తెరదించింది చిత్రబృందం. విషయం ఏంటంటే.. ‘రాకా’ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో చోటు సంపాదించుకుంది. అదెలా అంటే.. సాధారణంగా హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్స్‌లో వాడే అత్యధునిక ‘మోషన్ క్యాప్చర్’ సాంకేతికతను ఈ చిత్రంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో వాడారట. ఈ క్రమంలో ‘మోస్ట్ పీపుల్ మోషన్-క్యాప్చర్డ్ ఇన్ రియల్ టైమ్’ విభాగంలో.. అంటే ఏకంగా 37 మంది పెర్ఫార్మర్ల కదలికలను ఒకేసారి రియల్-టైమ్‌లో రికార్డ్ చేశారట.

ఆ విభాగంలో ‘రాకా’ చిత్రానికి ఈ అరుదైన రికార్డు సాధ్యమైనట్టు అర్ధం చేసుకోవచ్చు. అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ ఇద్దరూ కలిసి గిన్నిస్ ప్రతినిధుల నుండి సర్టిఫికెట్ అందుకుంటున్న ఫోటోలను కూడా చిత్ర బృందం షేర్ చేసింది. ఒక రకంగా ఇది ఇండియన్ సినీ పరిశ్రమకే గర్వకారణం అని చెప్పాలి. టెక్నికల్ గా తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్..కి వెళ్లింది అనేది కూడా ఈ రికార్డుతో చాటిచెప్పినట్టు అయ్యింది. రిలీజ్ కి ముందే ‘రాకా’ ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..!

ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus